బ్యాంకుల్లో కొలువుల జాతర 8822 పీవో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న 20 జాతీయబ్యాంకుల్లో 8822 పీవో/ఎంటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది.
-వివరాలు: ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ రిటన్ ఎగ్జామ్ (VI) - 2016 నోటిఫికేషన్ ఇది. దీని ద్వారా మొత్తం 8822 పోస్టులను భర్తీ చేయనున్నారు.
-ఏయే బ్యాంకుల్లో: కెనరా బ్యాంక్- 2200, ఐడీబీఐ- 1350, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 899, పంజాబ్ నేషనల్ బ్యాంక్- 750, అలహాబాద్ బ్యాంక్- 525, యూకో బ్యాంక్- 540, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్- 500, విజయాబ్యాంక్- 500, సిండికేట్ బ్యాంక్- 400, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 300, ఆంధ్రా బ్యాంక్- 300, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 200, బ్యాంక్ ఆఫ్ ఇండియా- 200, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్- 158, కార్పొరేషన్ బ్యాంక్- 00, దేనాబ్యాంక్- 00, బ్యాంక్ ఆఫ్ బరోడా- 00, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 00, ఇండియన్ బ్యాంక్- 00, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 00 (మొత్తం 20 బ్యాంకులు - 8822 పోస్టులు).
-వయస్సు: 2016, జూలై 1 నాటికి 20 -30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎంపిక:ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వూ ద్వారా
-నోట్: ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి మెయిన్స్, ఖాళీలను బట్టి మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వూకు పిలుస్తారు. తుది ఎంపికకు మెయిన్స్, ఇంటర్వూలకు 80: 20 నిష్పత్తిలో వెయి ఉంటుంది.
-ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి సబ్జెక్టులోనూ, మొత్తం మీద నిర్దేశ కటాఫ్‌ను సాధించాలి.
-ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 600/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/-
-కొత్త అంశాలు: ఈసారి మెయిన్స్ పరీక్షలో సబ్జెక్టు వారీగా ప్రత్యేక సమయాన్ని కేటాయించారు.
-స్కోర్ వ్యాలిడిటీ: ఈ కామన్ రిటన్ ఎగ్జామ్ (VI)లో సాధించిన స్కోరుకు 2018, మార్చి 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
ముఖ్యతేదీలు
-ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభం - జూలై 26
-చివరితేదీ: ఆగస్టు 13
-ప్రిలిమినరీ పరీక్షతేదీ: అక్టోబర్ 16, 22, 23
-ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి - 2016, నవంబర్
-మెయిన్ ఎగ్జామినేషన్ - 2016, నవంబర్ 20
-మెయిన్ ఫలితాల వెల్లడి - 2016, డిసెంబర్
-ఇంటర్వూలు - 2017, జనవరి/ఫివూబవరి
-వెబ్‌సైట్: WWW.IBPS.IN